27.5 C
India
Wednesday, May 8, 2024
More

    Amit Shah : ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది : అమిత్ షా

    Date:

    Amit Shah
    Amit Shah

    శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఉగ్రవాద సంబంధిత ఘటనలు 66 శాతం తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు.

    పౌర హత్యల్లో 81 శాతం, భద్రత సిబ్బంది మరణాల్లో 48 శాతం తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. స్థానికంగా శాంతియుగం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ప్రాంతం ఉగ్రవాదం నుంచి పర్యాటకం వైపు మళ్లుతోందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూలో 100 ఈ-బస్సులకు అమిత్‌ షా పచ్చజెండా ఊపారు. స్థానికంగా ప్రభుత్వ, కారుణ్య ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక యువత ఓటర్లుగా నమోదు చేసుకుని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం కావాలని విజ్ఞప్తి చేశారు.

    ‘‘2000లో 2,654 రాళ్ల దాడి ఘటనలు జరిగాయి. 2010లో రాళ్ల దాడుల్లో 112 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 2023లో ఇటువంటివి ఒక్కటీ చోటుచేసుకోలేదు. స్థానికంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధుల ప్రవాహాన్ని అరికట్టాం. ఆస్తులను అటాచ్ చేస్తున్నామని వెల్లడించారు.

    అనేక ఉగ్ర సంస్థలపై నిషేధం విధించాం..
    బాంబు పేలుళ్లు, కాల్పులు, బంద్‌లు.. విద్యాసంస్థలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలతో భర్తీ అవుతున్నాయి. ఇది అతిపెద్ద మార్పు. 2019-20లో జమ్మూ- కశ్మీర్‌కు రూ.297 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022-23లో రూ.2,153 కోట్లకు పెరిగాయి. మరో రూ.6,000 కోట్లు రానున్నాయి’’ అని అమిత్‌ షా తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ‘ఆర్టికల్ 370’ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు (జమ్మూ- కశ్మీర్, లద్ధాఖ్‌) గా విభజించింది.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amit Shah : ప్రజల తిరస్కరించడంతో నే చంద్రబాబును మళ్లీ NDA లోకి వచ్చాడు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    గతంలో బిజెపిని తిట్టిన చంద్రబాబు నాయుడుతో ఎందుకు మీరు పొత్తు పెట్టుకున్నారని...

    Amit Shah : జగన్ తో పొత్తెందుకు లేదు? అమిత్ షా ఏమన్నారంటే?

    Amit Shah : కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతునిచ్చిన జగన్తో పొత్తు ఎందుకు...

    Amit Shah : రాష్ట్రాలు సిఏఏ ని అడ్డుకోలేవు: కేంద్ర మంత్రి అమిత్ షా

    Amit Shah : సిఏఏ అమలు చేయమని కేరళ, తమిళనాడు ,బెంగాల్ రాష్ట్ర...

    Amit Shah : తెలంగాణలో బిజెపి 12+ స్థానాలు గెలవాలి: అమిత్ షా

    Amit Shah : నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావడం ఖాయమని...