Richest Cricketers : టీమిండియాలో కోటీశ్వరులున్నారు. ఒక్కొక్కరి ఆదాయం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వారి సంపాదన రూ. కోట్లలోనే ఉంది. క్రికెట్ అంటేనే అందరికి గుర్తొచ్చే పేరు సచిన్ టెండుల్కర్. ఆయన సంపాదన రూ. 1300 కోట్లు. అంత భారీ సంపాదన ఉన్న వారిలో మనోడే నెంబర్ వన్. అత్యంత ధనవంతుడిగా ప్రస్తుతం ఆయనే కొనసాగుతున్నారు.
ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సంపాదన కూడా బాగానే ఉంది. ఇప్పుడు రోహిత్ ఆస్తి విలువ రూ. 180 కోట్లుగా ఉంది. ఇక భారత మాజీ స్టార్ బ్యాటర్ సురేష్ రైనా ఆస్తి రూ. 185 కోట్లుగా ఉంది. మరో డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ ఆదాయం కూడా మంచిగానే ఉంది. ఆయన నికర ఆస్తి విలువ రూ. 255 కోట్లుగా తేల్చారు. ఇలా ఒక్కొక్కరి సంపాదన చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది.
రాజకీయ నేతగా మారిన మాజీ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నికర ఆస్తి విలువ రూ.150 కోట్లు. ప్రస్తుత కోచ్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఆస్తి విలువ కూడా రూ.172 కోట్లు. ఇతడు బ్యాటింగ్ వాల్ గా నిలిచేవాడు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి మనకు తెలిసిందే. అతడి ఆస్తి విలువ రూ.286 కోట్లు అని తెలుస్తోంది.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆస్తి రూ. 365 కోట్లు. విరాట్ కోహ్లి ఆస్తి రూ. 980 కోట్లు గా ఉంది. ప్రస్తుతం టీమిండియా, ఐపీఎల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మాజీ సారధి ఎంఎస్ ధోని ఆస్తి విలువ రూ.960 కోట్లు. ఇలా మన క్రికెటర్ల సంపాదన కోట్లలోనే ఉంది. వారికి అందించే పారితోషికం అదే రేంజిలోనే ఉంటుందని తెలుస్తోంది. అందుకే వారి ఆస్తి విలువ కోట్లు దాటుతోంది.