Bank బ్యాంకులు వినియోగదారులకు సేవలు మరింత సులువు చేస్తున్నాయి. ఇన్నాళ్లు ఏదైనా అవసరం పడితే బ్యాంకుకు వె ళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా చేస్తున్నాయి. మన వాట్సాప్ నెంబర్ ద్వారా మనం హాయి అని సందేశం పంపితే మనకు సమాధానం వస్తుంది. దీంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోతోంది. వినియోగదారుల సౌకర్యార్థం బ్యాంకులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నాయి. అందుకే సేవలు సులభతరం అవుతున్నాయి.
ఎస్బీఐ బ్యాంకు నెంబర్ 9022690226, ఐసీఐసీఐ బ్యాంకు నెంబర్ 8640086400, పంజాబ్ నేషనల్ బ్యాంకు నెంబర్ 9264092640, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు నెంబర్ 8433888777, హెచ్డీ ఎఫ్సీ బ్యాంకు నెంబర్ 7070022222, యూనియన్ బ్యాంకు నెంబర్ 9666606060, యాక్సిస్ బ్యాంకు నెంబర్ 7036165000, ఇండియన్ బ్యాంకు నెంబర్ 8754424242, ఐడీబీఐ బ్యాంకు నెంబర్ 8860045678, కొటక్ మహేంద్ర బ్యాంకు నెంబర్ 9718566655, యెస్ బ్యాంకు నెంబర్ 8291201200
మనకు ఏదైనా అవసరం పడితే సంబంధిత నెంబర్ కు మనం హాయి అని సందేశం పంపితే మనకు ఏ అవసరం ఉన్నా వెంటనే సమాధానం వస్తుంది. ఇలా మనం బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండా అవి తమ సేవలు అందించనున్నాయి. మారుతున్న కాలంలో సేవలు కూడా మార్పు చెందుతున్నాయి. ఇందులో భాగంగానే ఇలా సేవలను అందించనున్నాయి.
ఈ మేరకు అన్ని బ్యాంకుల వినియోగదారులు ఇక మీదట బ్యాంకుకు వెళ్లకుండానే తమ అవసరాలు తీర్చుకోవచ్చు. ఎలాంటి సందేహమున్నా నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వినియోగదారుల సమయం ఆదా చేయడమే ధ్యేయంగా బ్యాంకులు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాయి.