34 C
India
Tuesday, May 7, 2024
More

    Telangana : తెలంగాణలో త్రిముఖ పోటీ.. ఎవరు గట్టెక్కేనో..?

    Date:

    Telangana MP Elections 2024
    Telangana MP Elections 2024

    Telangana MP Elections 2024 : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మొదటి ఫేజ్ పోలింగ్ 19న ముగిసింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి సీఎం సీటు అధిరోహించిన రేవంత్ రెడ్డికి తన ప్రభుత్వం కూలుతుందా? అన్న ఆందోళన కనిపిస్తుంటే.. బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారు.

    కొంతలో కొంత బీజేపీ పెద్దగా ఆందోళన పడకున్నా.. ఓట్ల శాతం గణనీయంగా పెంచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మూడు పార్టీలు మైండ్ గేమ్స్ ఆడుతూ ప్రత్యర్థులను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో బీజేపీ ఒక్కటే గట్టున ఉంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా పావులు కదుపుతుంది. కల్వకుంట్ల కవిత అరెస్ట్. ఆ తర్వాత ఈడీ, సీబీఐ ఉచ్చులో బాగా ఇరుక్కుపోయింది.

    బాస్ కూతురు జైలులో ఉండడంతో బాస్ మోడీకి తలవంచాల్సి వచ్చిందని, అందుకే 5 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకునేందుకు తోడ్పాటు ఇస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

    గతంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు, వారి సొంత మీడియాలో మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఆ సీన్ మారినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు రేవంత్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు. వారి మీడియాలో కూడా మోడీకి వ్యతిరేకంగా వార్తలు రావడం లేదు.

    బీఆర్ఎస్ లో ఈ మార్పు బీజేపీతో దోస్తీకి సంకేతాలని కాంగ్రెస్‌ వాదిస్తుంది. ఇటీవల కేటీఆర్‌ మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీయే కూలుస్తుందంటూ స్టేట్‌మెంట్లు చేస్తున్నాడు. 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ తానే ఆగమని చెప్పానని కేసీఆర్‌ చెప్పుకున్నారు కూడా.

    లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొడతాయని రేవంత్‌ గ్రహించినట్లే ఉన్నారు. అందుకే ‘నా ప్రభుత్వం, ఎమ్మెల్యేల జోలికి వస్తే తాట తీస్తా.. మాడి మసైపోతారు’ అంటూ ఫ్రస్టేషన్ లో రేవంత్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

    తమ ప్రభుత్వానికి ప్రమాదం ఉందనుకుంటున్న రేవంత్‌ రెడ్డి, మంత్రులు వీలైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో రప్పించేందుకు కృషి చేస్తున్నారు.

    ఈ పరిణామాలను చూస్తుంటే బీజేపీ+బీఆర్ఎస్ రేవంత్ ప్రభుత్వాన్ని కూలుస్తారా? లేదంటే బీజేపీ+కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ ను కాళీ చేస్తాయా? అని బీఆర్ఎస్, ఇక తెలంగాణలో కేసీఆర్, రేవంత్ ఎవరు ఉంటే బాగుంటుందని బీజేపీ అనుకుంటుంది? ఇలా తెలంగాణలో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు సాగుతోంది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Victory Venkatesh : ఖమ్మంలో ప్రచారం చేయనున్న విక్టరీ వెంకటేష్?

    Victory Venkatesh : ఖమ్మం నియోజకవర్గానికి గ్లామరస్ మేకోవర్ రాబోతోంది! 2024...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...