ఏపీ: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తండ్రి షేక్ హాజీ వలి పై పలువురు దుండగులు దాడి చేశారు. గత రాత్రి పులివెందుల సమీపంలోని నామాల గుండు వద్ద ఈ ఘటన జరిగింది.
శివరాత్రి జాగరణకు వెళ్లిన హాజీవలిని అడ్డగించి దాటికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పులివెందులలో సీఎం జగన్ పై పోటీ చేస్తానని ప్రకటించిన దస్తగిరి ఇటీవల జై భీమ్ పార్టీలో చేరారు.
దస్తగిరి జై భీమ్ పార్టీలో చేరి సీఎం జగన్ పైనే పోటీ చేస్తానని చెప్పడం వల్లనే దస్తగిరి తండ్రిపై దాడి జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.