Vijaya devarakonda: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.. విజయ్ స్టార్ హీరోల సరసన చేరేందుకు ఒక్క మెట్టు మాత్రమే తక్కువులో ఉన్నాడు.. ఎన్ని ప్లాప్స్ వచ్చిన కెరీర్ లో మరింత నిలదొక్కుకుంటూ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.
పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ తన నెక్స్ట్ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.. ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమా చేస్తున్నాడు. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఖుషి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..
సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నిన్న గ్రాండ్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ విలేకరుల ప్రశ్నలకు చాలా ఓపికగా నవ్వుతు సమాధానం చెప్పారు.. ఇక ఒక జర్నలిస్ట్ విజయ్ దేవరకొండను అనసూయ వివాదం గురించి ప్రశ్నించాడు..
ఆ వివాదం గురించి నాకు అసలు తెలియదు.. కాంట్రవర్సీ క్రియేట్ చేసే వారినే అడగండి.. నాకు తెలియదు అంటూ అనసూయకు కౌంటర్ ఇచ్చాడు.. అంతేకాదు పేరు ముందు ‘ది’ అని ఎందుకు పెట్టుకున్నారు అని అడుగగా.. నాకు విజయ్ దేవరకొండ అనే పేరు చాలు.. కానీ అంతా రౌడీ స్టార్ అని, సెన్సేషనల్ స్టార్ అని రాస్తున్నారు.. అందుకే ది విజయ్ దేవరకొండ మాత్రమే చాలు నాకు ఇంకేమీ నేమ్స్ వద్దు అని చెప్పడానికే అలా పెట్టుకున్న అంటూ సెలవిచ్చాడు..