Vishwak Sen :
ప్రముఖ నటుడు విశ్వక్ సేన్ ఎప్పుడు వివాదాల్లో ఉంటాడు. ఏది మాట్లాడినా గొడవకే దారి తీస్తుంది. ప్రస్తుతం బేబి సినిమా దర్శకుడు విశ్వక్ సేన్ గురించి ఓ మాట అన్నాడు. దానికి విశ్వక్ కూడా కౌంటర్ ఇచ్చాడు. బేబి కథ చెబుతానంటే విశ్వక్ కనీసం వినలేదని చెప్పడం గమనార్హం. దీంతో దీనిపై విశ్వక్ కూడా తనదైన రీతిలో స్పందించాడు.
ఫలక్ నుమా దాస్ సినిమా పోస్టర్ చించేశారని గొడవ చేశాడు. ఇది విజయ్ కుట్ర అని ఆరోపించాడు. అశోక వనంలో అర్జున కల్యాణం విడుదలకు ముందు మరో వివాదంలో ఇరుక్కున్నాడు. లక్ష్మణ్ అనే వ్యక్తితో రోడ్డు పక్కన ఫ్రాంక్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. పబ్లిక్ లో రచ్చ చేసినందుకు టీవీ 9 షో నుంచి దేవి నాగవల్లి బయటకు పంపించింది.
తాజాగా విశ్వక్ సేన్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. బేబి డైరెక్టర్ తన కథ కూడా వినలేదని చెబితే వద్దు వద్దు అంటే మగాళ్లకు కూడా వర్తిస్తుందని కౌంటర్ ఇచ్చాడు. దీంతో విశ్వక్ సేన్ మాటలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ బేబి డైరెక్టర్ సాయి రాజేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
విశ్వక్ సేన్ అలా మాట్లాడటంపై ఇద్దరి మధ్య మాటల పర్వం కొనసాగుతోంది. విశ్వక్ సేన్ ఫ్యాన్స్ బేబి సినిమా చేయకపోవడమే బెటర్ అని చెబుతున్నారు. దర్శకుడు సాయి రాజేష్ ఏదో టైటానిక్ తీసినట్లు ఫీలవుతున్నాడని అభిమానులు విశ్వక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబి సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది.