37 C
India
Tuesday, May 7, 2024
More

    Star Heroes : పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసే స్టార్ హీరోలు ఎవరంటే?

    Date:

    Star Heroes :

    సినిమా పట్టాలెక్కక ముందే ప్రొడ్యూసర్లు హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్.. నటీనటుల పారితోషికంపై ఓ అంచనా వస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ముందుగా వారి డేట్స్ బుక్ చేసుకుని కొంత మొత్తంలో అడ్వాన్స్ ఇస్తుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొందరు స్టార్ హీరోలు మాత్రం తమ సినిమాకు ఎటువంటి పారితోషికం తీసుకోరు. సినిమా విడుదలయ్యాక వచ్చిన లాభాల్లో నుంచి వాటాను తీసుకుంటారు.టాలీవుడ్లోనూ ఇటువంటి స్టార్స్ సైతం కొదవలేదు.

    మెగా స్టార్ చిరంజీవి భారతదేశంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. కోటి రూపాయల పారితోషికం అందుకున్న నటుడు కూడా మెగాస్టారే కావడం విశేషం. చిరంజీవి తన స్నేహితులు.. ఫ్యామిలీ బ్యానర్లో నటించినప్పుడు మాత్రం రెమ్యూనేషన్ తీసుకున్న సందర్భాలు తక్కువే. సినిమా విడుదలై లాభాలు వచ్చాకే వాటాను తీసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తన ఫ్యామిలీ ప్రొడక్షన్స్ అయినా గీత ఆర్ట్స్.. అంజనా ప్రొడక్షన్స్ లో చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకునే వారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఖైదీ నెంబర్ 150 సినిమా లాభాల్లో ఆయన వాటాను తీసుకున్నారు.

    సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మొదటిసారి శ్రీమంతుడు సినిమాకుగాను లాభాలను తీసుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ‘బాహుబలి’ సినిమాకు పారితోషికం తీసుకోలేదు. ఈ మూవీకి 600 కోట్ల కలెక్షన్లు రావడంతో నిర్మాతలు అతనికి 25 కోట్ల పారితోషికం ఇచ్చారు. బాహుబలి-2 సినిమాకు గాను డీసెంట్ పర్సంటేజ్ ప్రభాస్ కు ముట్టింది.

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 12 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటారు. అయితే నాగబాబు నిర్మించిన ‘ఆరెంజ్’.. అల్లు అరవింద్ నిర్మించిన ధృవ చిత్రానికి రాంచరణ్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. పవన్ కల్యాణ్ సైతం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నాటి నుంచి తన చిత్రాలకు లాభాలలో వాటాను తీసుకుంటున్నాడు.

    సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జునా సైతం సినిమా లాభాల్లో వాటాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాబు బంగారం.. గురు చిత్రాలకు వచ్చిన లాభాల్లో వెంకటేష్ కొంత వాటా తీసుకోగా నాగార్జున మనం.. సోగ్గాడే చిన్నినాయనా సినిమా లాభాల్లో వాటా తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ చిత్రంలో నటించేందుకు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. సినిమాకు వచ్చిన లాభాల్లో వాటాను తీసుకోవడం జరిగింది.

    Share post:

    More like this
    Related

    Parvati Melton : పార్వతి మెల్టన్ కు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటీ?

    Parvati Melton : జల్సా మూవీ సినిమాలో ఇలియానా ఫస్ట్ హిరోయిన్...

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    Rythu Bandhu : రైతు బంధు క్రెడిట్ ఎవరికి  దక్కుతుంది ???

    Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    TDP Alliance : టీడీపీ కూటమి ఘన విజయం పక్కా..చంద్రబాబు ధీమా ఇదే

    TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25...