31.3 C
India
Saturday, April 27, 2024
More

    Star Heroine : రజనీ ఎత్తుకున్న ఈ పప ఎవరో తెలుసా.? స్టార్ హీరోయిన్! ఇప్పటికీ ఆమె అలరిస్తోంది

    Date:

    Star heroine
    Star heroine

    Star heroine : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది భామలు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. చిన్నతనం నుంచి నటనలోనే ఉన్న చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు నటనలో ఎలాంటి జంకు బొంకు లేకుండా ఉంటారు. అందులో సౌత్ నుంచి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటరై ఎన్టీఆర్ కు మనుమరాలిగా చేసి, తర్వాత అదే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కూడా చేసింది. ఇలాంటి వారంతా వేరే లెవల్ ఆర్టిస్ట్‌లనే చెప్పాలి.

    రజినీకాంత్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఇప్పటి వారికైతే తెలియక పోవచ్చు గానీ, 19’s వారికి మాత్రం తప్పకుండా తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె స్టార్ హీరోయిన్. తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. బాల్యం నుంచే సినిమాలలో నటిస్తున్న అమ్మాయి చాలా పాత్రలు వేసింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో యంగ్ హీరోలు, హీరోయిన్లకు మదర్ గా, వదినగా నటిస్తుంది. ఇప్పటికీ ఆమె గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదనడంలో సందేహమే లేదు.

    ఆమె పేరే మీనా సాగర్. మీణ బాల్యం నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. సిరివెన్నెల సినిమాలో అంధ బాలికగా ఆమె నటన బేష్ అనే చెప్పాలి. ఇలా చాలా సినిమాల్లో నటించి హీరోయిన్ అయ్యింది. సౌత్ ఇండస్ట్రీలో ఒక దశలో చక్రం తిప్పింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, రాజశేఖర్‌ తదితర స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. రజినీకాంత్‌తో కలిసి చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి తర్వాత హీరోయిన్‌గా కూడా నటించడం విశేషం. అందం, అభినయంతో సుమారు 15 సంవత్సరాలు సౌత్ ఇండస్ట్రీని ఏలింది. పెళ్లి తర్వాత కూడా సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తూ అలరించింది.

    చైల్డ్ ఆర్టిస్ట్ గా రజినీకాంత్ కూతురి పాత్రలో నటించింది మీనా. ఆ సినిమా తీస్తున్న సమయంలో ఆమె వయస్సు 7 సంవత్సరాలు మాత్రమే. మరో సినిమాలో అదే హీరోకు మేనకోడలిగా నటించింది. హీరోయిన్‌గా ఎంట్రీ తర్వాత అదే హీరో పక్కన కథానాయికగా కనిపించింది. ముత్తు సినిమాలో రజినీకాంత్ మీనా జోడీ అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    ఇవ్వన్నీ పక్కన పెడితే ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుంటే. సౌత్ ను ఏలిన మీనా 2009లో సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప (నైనిక) కూడా పుట్టింది. పోస్ట్ కోవిడ్ తో ఆమె భర్త చనిపోయాడు. అప్పటి నుంచి పాపతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది మీనా. నైనిక కూడా తెరంగేట్రం చేసిందండోయ్. పోలీసోడు సినిమాలో విజయ్ బిడ్డగా నటించిండి నైనికనే. మీనా లానే చక్కటి అభినయం ప్రదర్శించింది.

     

     

    View this post on Instagram

     

    A post shared by Meena Sagar (@meenasagar16)

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Star Heroine : 50 సెకన్ల యాడ్ కు రూ.5 కోట్లు.. తల్లైనా తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్

    Star Heroine : సినిమా హీరోయిన్లంటే మన జనాలకు విపరీతమైన పిచ్చి....