Ram Charan : మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇప్పుడు ఎవ్వరూ ఈయన దరిదాపుల్లో కూడా చేరుకోలేని స్థాయికి మెగాస్టార్ చేరుకున్నాడు.. ఆరు పదుల వయసులో కూడా ఇప్పటికి ఇదే హుషారుతో సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు..
మధ్యలో దాదాపు దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరు రాజకీయాల్లో బిజీ అయ్యారు. అయితే ఈయనకు రాజకీయాలు సెట్ అవ్వలేదు అని మళ్ళీ తనకు లైఫ్ ఇచ్చిన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. భోళా శంకర్ గట్టి దెబ్బ కొట్టడంతో ఈయన ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఇటీవలే చిరు పుట్టిన రోజు నాడు రెండు కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేసారు. ఇవి ఇంకా స్టార్ట్ కాలేదు.. ప్రజెంట్ ఈ రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా నవంబర్ నెల వరకు ఈయన షూటింగులకు దూరంగా ఉండనున్నారు. ఈ సమయం మొత్తం ఈయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఇటీవలే చిరుకు మోకాలి సర్జరీ జరిగింది..
దీంతో ఈయన ప్రజెంట్ కర్ర సహాయంతో నడుస్తున్నాడని సమాచారం.. చిరు అందుకే ఇండస్ట్రీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారట.. ఈ ఈవెంట్స్ కు ఆయన బదులుగా ఆయన కుమారుడిని పంపిస్తున్నారని సమాచారం.. అంతేకాదు చరణ్ ను టాలీవుడ్ కు బాగా దగ్గర చేయాలని చూస్తున్నారట. అందుకే ఏ ఈవెంట్ జరిగిన రామ్ చరణ్ ను పంపిస్తున్నారని టాక్.. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన తన స్థానాన్ని రామ్ చరణ్ కు కట్టబెట్టాలనే ఆలోచనలో ఈయన ఉన్నట్టు టాక్ తెగ వైరల్ అవుతుంది.