34.1 C
India
Thursday, May 9, 2024
More

    Sharmila Yatra : షర్మిల ఆన్ పాపులర్ చేసేందుకు వైసీపీ జిమ్మిక్కులు!

    Date:

    Sharmila Yatra
    Sharmila Yatra

    Sharmila Yatra : ప్రత్యర్థుల శిబిరాల్లోకి కార్యకర్తలను పంపి రచ్చ చేయడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నానా యాగీ చేయడం వైసీపీ ప్రచార వ్యూహంలో భాగమని ఎవరిని అడిగినా చెప్తారు. వైసీపీ ప్రచార వ్యూహానికి దెబ్బకొట్టింది షర్మిల. సదరు వైసీపీ నాయకుడు మాత్రం ఖంగు తిన్నాడు. అసలు ఏం జరిగిందంటే.

    కాంగ్రెస్ పార్టీ తరుఫున షర్మిల కడపలో ప్రచారం చేసేందుకు వచ్చింది. అక్కడకు వచ్చిన వారిలో ఒక వ్యక్తి తాను షర్మిల ఫ్యాన్ అని కలరింగిచ్చి మైక్ తీసుకున్నాడు. ఇంకే ముంది సాక్షి స్క్రిప్ట్ మొత్తం బట్టీ పట్టి మరీ చదివాడు. ‘2011లో వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మా కోసం పని చేస్తున్నాడని, పాదయాత్ర చేశాడని, పాదయాత్రలో చెప్పిన ప్రతీ హామీ నెరవేర్చాడని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా.. మీ కుటుంబ సమస్యలు ఏవో మీకు ఉన్నాయని.. అందుకే ఇక్కడ రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

    అతని మాటతీరు చూస్తే స్క్రిప్ట్ బట్టీ పట్టి వచ్చాడని అర్థమైంది. మొత్తం మాట్లాడేవరకు విన్న షర్మిల మాత్రం ఎలాంటి ఆవేశానికి గురి కాలేదు. ఆ తర్వాత తాను ఒక మాట అంది. ‘నువ్వు అభిమానించే వ్యక్తి కోసం నేను 3,200 కి.మీ. నడిచా.. సొంత చెల్లి బతుకే రోడ్డున పడేశాడు.. మీరెంత’ అనడంతో ఆ యువకుడికి నోట మాట రాలేదు. దీని తర్వాత ఎలా మాట్లాడాలో స్క్రిప్ట్ ఆ యువకుడికి ఇవ్వలేదు కాబట్టి.. వెళ్లిపోయాడు.

    వైసీపీ సోషల్ మీడియా వింగ్ షర్మిల కౌంటర్ పక్కన పెట్టి ఆ యువకుడి వీడియోను ప్రచారం చేస్తోంది. వీడియోను ఎడిట్ చేసి.. గ్రూపులకు ఫార్వార్డ్ చేసింది. సోదరుడి రాజకీయాన్ని షర్మిల అర్థం చేసుకున్నట్టే కనిపిస్తోందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...