
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా పదవీ కాలం పొడిగిస్తునట్లుగా ప్రకటించారు కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా. రెండు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో మరోసారి నడ్డాకు పొడిగింపు ఉంటుందా ? లేదా ? అనే అనుమానం ఉండేది.
అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ 2024 జూన్ వరకు జేపీ నడ్డా పదవీ కాలం పొడిగిస్తునట్లుగా , అందుకు జాతీయ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లుగా ప్రకటించారు అమిత్ షా. 2024 ఏప్రిల్ లోపు లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నాయి దాంతో నడ్డా నాయకత్వంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్తామని , అలాగే భారీ విజయం సాధిస్తామని ప్రకటించారు. అంతేకాదు ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి దాంతో ఆ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో వెళ్లాలనే దానిపై చర్చించారు.