
Cucumbers : ఎండాకాలంలో మనకు దోసకాయ ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం నీరుండటంతో ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాహం తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. జబ్బుల నివారణలో బరువు నియంత్రణలో ఉంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దోసకాయ వల్ల మనకు చాలా రకాల లాభాలున్నాయి.
గుమ్మడి జాతికి చెందిన దోసకాయ ఆరోగ్య పరిరక్షణలో ముందుంటుంది. ఇందులో విటమిన్ ఎ,సి,కె తోపాటు పొటాషియం, కాల్షియం ఉండటంతో పోషకాలు మెండుగా ఉన్నాయి. వీటిని పచ్చిగా తినొచ్చు. కూర వండుకుని కూడా తినవచ్చు. ఇందులో ఉండే నీటి శాతం మనకు ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో దోసకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు దక్కుతాయి.
దోసకాయ తింటే ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో ఎముకలు విరిగే అవకాశం ఉండదు. కాల్షియం ఉండటంతో మంచి బలం కలుగుతుంది. దోసకాయలో ఉండే నీరు జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. దోసకాయ పచ్చడి కూడా చేసుకుంటారు. దీంతో మంచి బ్యాక్టీరియా పెరిగి మనకు రోగాలు రాకుండా చేస్తుంది.
ఇందులో కేలరీలు, పిండిపదార్థాలు, చక్కెర తక్కువగా ఉండటం వల్ల బరువును నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం నియంత్రణలో ఉంచుతాయి. పీచు దండిగా ఉండటంతో త్వరగా ఆకలి వేయదు. ఎక్కువగా తినాలనిపించదు. ఇలా దోసకాయ వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. దీన్ని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.