బ్రిటన్ ప్రధాని రేసులో ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులు ఉండటం గమనార్హం. బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి మొత్తం ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేసారు. కాగా ఆ ఎనిమిది మందిలో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం. భారత సంతతికి చెందిన రిషి సునాక్ , సుయెలా బ్రావెర్మన్ లు ఇద్దరు కూడా తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేసారు. అయితే ఈ ఎనిమిది మందిలో గురువారం నాటికి ఆరుగురు వ్యక్తులను తప్పించి కేవలం ఇద్దరిని మాత్రమే పోటీలో ఉండేలా చేయనున్నారు.
ఇక ఆ ఇద్దరిలో ఎవరు ప్రధాని అని తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే బ్రిటన్ ప్రధాని పదవి అధిరోహించే ముందు కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. పార్టీ అధినేత మాత్రమే బ్రిటన్ ప్రధాని పదవి చేపడతారు. ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న వాళ్లలో ఎనిమిది మంది ఉన్నప్పటికీ ఎక్కువ అవకాశాలు మాత్రం పెన్నీ మొర్దాంట్ కు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అవకాశం మన భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ కు ఉన్నాయని అంటున్నారు.