ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నాడు కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి. మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కానున్నాడు అవినాష్ రెడ్డి. 2019 లో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అవినాష్ రెడ్డి.
సీబీఐ విచారణకు రావాలని అవినాష్ రెడ్డి ని కోరగా ఇటీవల పలు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని లేఖ రాసాడు. దాంతో ఈనెల 28 న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఈరోజు విచారణకు హాజరు అవుతున్నాడు. ఇక ఈ సందర్బంగా ఓ లేఖ రాసాడు అవినాష్ రెడ్డి. ఈ హత్య కేసులో నాపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది ఓ మీడియా వర్గం. అందుకే నావెంట లాయర్ ను కూడా అనుమతించాలని అలాగే వీడియో కూడా తీయాలని సీబీఐని కోరాడు అవినాష్ రెడ్డి.