
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడింది. రెండు రోజుల పాటు నారా లోకేష్ తన పాదయాత్రకు బ్రేక్ నిచ్చాడు. ఏపీ ఎన్నికల సంఘం లోకేష్ పాదయాత్రను ఆపాలని ఆదేశాలు జారీ చేయడంతో పాదయాత్రకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈనెల 13 న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో రేపు అలాగే ఎల్లుండి రెండు రోజుల పాటు తన పాదయాత్రకు బ్రేక్ ఇస్తూ హైదరాబాద్ కు బయలుదేరాడు నారా లోకేష్. ఇప్పటి వరకు 500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసాడు నారా లోకేష్. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యాక మళ్లీ మార్చి 14 నుండి యధావిధిగా పాదయాత్ర కొనసాగించనున్నాడు.