
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గాయాలయ్యాయి. దాంతో ఈరోజు ఆపరేషన్ చేయనున్నారు డాక్టర్లు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి రోజున సత్యసాయి జిల్లాలో పర్యటించారు నారా లోకేష్. దాంతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు , కార్యకర్తలు నారా లోకేష్ ను చూడటానికి వచ్చారు. అయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది. అంతా నారా లోకేష్ మీద పడటంతో రెండు భుజాలకు గాయాలయ్యాయి. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు . ఈ విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు తీవ్ర షాక్ కి గురయ్యారు. పోలీసుల వైఫల్యం వల్లే నారా లోకేష్ భుజాలకు గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు.