
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇక తెలంగాణలోనే మకాం పెట్టనున్నాడట. ఎందుకో తెలుసా …… తెలంగాణలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్నాడట. అయితే తెలంగాణ లోని బీజేపీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాళ్లందరినీ గాడిలో పెట్టడానికి అలాగే కేసీఆర్ ను ఎదుర్కొని వ్యూహాలు పన్నడానికి ……. అలాగే తెలంగాణ పీఠాన్ని కాషాయమయం చేయడానికి అమిత్ షా డిసైడ్ అయ్యాడట.
అయితే కర్ణాటకలో మేలో ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో అక్కడ ఎన్నికలు అయ్యాక అమిత్ షా తన ద్రుష్టి మొత్తం తెలంగాణ మీదే పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే బీజేపీ నాయకులకు సంకేతాలు ఇచ్చాయట పార్టీ కేంద్ర నాయకత్వం. తెలంగాణలో ఈసారి కేసీఆర్ ను ఇలాగైనా సరే ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్నారట కాషాయ దళాలు. అందుకే అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగుతున్నాడట.