కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం నైజాం నవాబ్ చేతిలోనే ఉంది. దాంతో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి మరో ఏడాదిన్నర కాలం పట్టింది. సెప్టెంబర్ 17 న తెలంగాణకు విముక్తి లభించింది. దాంతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని 74 సంవత్సరాలుగా తెలంగాణ నాయకులు కోరుతూనే ఉన్నారు. కానీ ఆంధ్రా పాలకుల చేతిలో అధికారం ఉండటంతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఘంటాపథంగా చెప్పారు కేసీఆర్. అయితే మాటలు చెప్పారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాని గురించే మర్చిపోయారు. ఇక ప్రతిపక్షాలు ఎంతగా మొత్తుకున్నా దాని ఊసేలేకుండా చేసారు. కట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలనే సంచలన నిర్ణయం తీసుకుంది.
దాంతో కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితిలు ఏర్పడ్డాయి. దాంతో అప్రమత్తమైన కేసీఆర్ సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవం కాకుండా విలీన దినోత్సవంగా జరపాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు కేసీఆర్. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ బలపడుతోంది. దాంతో టీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ , కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఈ వేడుకలలో పాల్గొననున్నారు.