32.2 C
India
Monday, April 29, 2024
More

    వివేకా హత్య కేసు విచారణ గడువు పెంపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    Date:

    Supreme court fires on cbi on vivekananda reddy murder case issue
    Supreme court

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణ గడువును పొడిగించింది .ఏప్రిల్  నెలాఖరు నాటికి కేసు విచారణను పూర్తి చేయాలని గతంలో ఆదేశించిన సుప్రీంకోర్టు.. తాజాగా సీబీఐ అభ్యర్థన మేరకు ఈ కేసు విచారణ కోసం జూన్ 20 వరకు గడువు ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వైఎస్ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సమంజసంగా లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అవినాష్ రెడ్డికి లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలన్న ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు ఆదేశాలు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంది.

    ముందుగా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇద్దరినీ ఒకేసారి విచారించాలని సీబీఐ భావించింది.. అయితే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డి కి నోటీసులు ఇచ్చే లోపే అవినాష్ రెడ్డి  తనను అరెస్ట్  చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు..

    ఇక ముందస్తు బెయిల్ అంశంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు బెయిల్‌పై తేల్చేంతవరకు అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. అయితే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరెందుకు ఊహిస్తున్నారని ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసి ఉండేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయనంతో ఉందని పేర్కొంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడికి సుప్రీంకోర్టు నోటీసులు

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ లోని...

    Tamil Nadu : తమిళనాడులో ప్రభుత్వం vs గవర్నర్..

    Tamil Nadu : తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది....

    CAA : CAA పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

    CAA : పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖ లైన పిటిషన్ ల...