39.3 C
India
Friday, April 26, 2024
More

    ఏపీలో కాకరేపుతున్న ఎంపీ కేశినేని వ్యాఖ్యలు.. వైసీపీకి దగ్గరవుతున్నట్లే్నా?

    Date:

    ఏపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. ఇలా ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది రెండోసారి. ఆయన ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్నారు. అయితే కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  మరోవైపు ఎంపీ కేశినేని నాని మాత్రం ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలతో సఖ్యతనే కొనసాగిస్తున్నారు.

    అయితే ఎంపీ కేశినేని నాని మాత్రం అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. విజయవాడ టికెట్ ఎవరికైనా ఇచ్చుకోచ్చునని, అందరికీ రెండు వేదికలు ఉంటాయని పేర్కొ్న్నారు. అంటే ఏపీలో వైసీపీ, టీడీపీ రెండు వేదికలు పోటీ చేసేందుకు ఉన్నాయని ఆయన చెప్పకనే చెప్పారు.మరోవైపు పార్టీ అధినేతల మధ్యే విభేదాలు ఉంటాయని, తమకు కావని చెప్పారు. 2019లో అన్ని పార్టీల్లో ఉన్న తన సానుభూతి పరుల వల్లే గెలిచానని, ఒక్క టీడీపీ వల్లే కాదని అన్నారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒకరినొకరు పొగుడుకున్నారు. అయితే ఇటీవల నందిగామలోనూ అక్కడి వైసీపీ ఎమ్మెల్యేను కూడా మెచ్చుకోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాన్ని నాలుగేళ్లలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గణనీయంగా అభివృద్ధి చేశాడని పేర్కొన్నారు. అయితే టీడీపీకి చెందిన ఎంపీని వైసీపీ ఎమ్మెల్యేలు కొనియాడడం, వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ ఎంపీ మెచ్చుకోవడం పార్టీలకతీతంగా మంచి సంప్రదాయమే అయినా ఇక్కడ మాత్రం కొంత చర్చనీయాంశమవుతున్నది. ఎంపీ కేశినేని నాని కొంత కాలంగా టీడీపీ అధినేత మీద కోపంగా ఉన్నట్లు సమాచారం.

    తన కుటుంబంలో విభేదాలను టీడీపీ అధినేత చంద్రబాబు వాడుకుంటున్నట్లు ఆయన భావిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే ఎన్నికలకు మరో ఏడాదే మిగిలి ఉండడం, మరో వైపు జగన్ ముందస్తు ఆలోచనల నేపథ్యంలో విజయవాడ ఎంపీ తీరు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారింది. ఆయన ఏకంగా తనకు మరో వేదిక కూడా ఉందని అధినేతకు హింట్ ఇస్తున్నట్లు అంతా భావిస్తున్నారు. అయితే టీడీపీ ఎంపీ కేశినేని నానికి సౌమ్యుడిగా పేరుంది. మరి ఆయన చంద్రబాబుపై ఆగ్రహించడానికి గల కారణాలపై చర్చ సాగుతున్నది.

    Share post:

    More like this
    Related

    One project : ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీశారా?

    One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి...

    Former CMs : జగన్ ను ఓడించడానికి ఒక్కటైన మాజీ సీఎంలు

    Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో...

    Bathing Tips : నగ్నంగా స్నానం చేస్తున్నారా! ఆ తప్పు మళ్లీ చేయద్దు..

    Bathing Tips : ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Former CMs : జగన్ ను ఓడించడానికి ఒక్కటైన మాజీ సీఎంలు

    Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    YS Jagan : మా చిన్నాన్నకు రెండో భార్య ఉంది: వైఎస్ జగన్

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పులివెందులలో బహిరం...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...