24 C
India
Saturday, September 12, 2026
More

    ఆదిపురుష్ : ట్రోల్స్ రావడం కూడా ప్లస్సే.. సోలో ఎంట్రీతో బాక్సాఫీస్ పై దండయాత్ర!

    Date:

    పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి.. ఈ సినిమా ఈ నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయనను రాముడి పాత్రలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.

    బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. సినిమా డేట్ ఫిక్స్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి రిలీజ్ కోసం సన్నద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ముందుగా టీజర్ రిలీజ్ చేసారు. కానీ ఈ టీజర్ కు దారుణమైన ట్రోల్స్ రావడం తెలిసిందే..

    మరి 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అందరు అంత దారుణంగా తీసేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ భయపడ్డారు. ఈ ట్రోలింగ్ కు లొంగకుండా సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసి ఉంటే ఇదే పరిస్థితి జరిగేది. కానీ ఆడియెన్స్ మాటలను దృష్టిలో పెట్టుకుని సినిమాను జూన్ 16కు వాయిదా వేసి మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ స్టార్ట్ చేసారు..

    ఆ సమయంలో రిలీజ్ అయ్యి ఉంటే సంక్రాంతి వార్ లో ఆదిపురుష్ సినిమా కొట్టుకు పోయి ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కలెక్షన్స్ అందుకునేది కాదు.. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా నెగిటివ్ కామెంట్స్ కారణంగా దారుణంగా కష్టాలను చవిచూడాల్సి వచ్చేది. ఇక ఈ మధ్య ప్రమోషన్స్ తో సినిమాపై నెగిటివిటీని తగ్గించారు. ప్లాన్ ప్రకారం అంతా చేయడంతో ఇప్పుడు మంచి హైప్ నెలకొంది..

    అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర కూడా ఇప్పుడు ఈ సినిమాకు మంచి పరిస్థితులు నెలకొన్నాయి.. సోలోగా ఇండియన్ బాక్సాఫీస్ మీద ఆదిపురుష్ దాడికి దిగుతుంది. అందుకే అప్పుడు ట్రోల్స్ రావడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrayaan-3 : చంద్రయాన్ -3 వ్యయం ఆదిపురుష్ కంటే తక్కువే తెలుసా?

    Chandrayaan-3 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన చంద్రయాన్...

    Adipurush MOvie : ఆదిపురుష్ తో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఒక్క రోజే ఏకంగా రూ.100 కోట్లు..?

    Adipurush MOvie : ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ తాజాగా...

    Aadhi Pursh : రాముడి సినిమాకు వచ్చిన ఆంజనేయుడు.. ఆదిపురుష్ ను ఆద్యంతం వీక్షించిన వానరం

    Aadhi Pursh : నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది....

    Aadhi Pursh : ఆదిపురుష్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. ఎలా ఉందంటే?

    Aadhi Pursh :  అందరు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది.. దేశ...