29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Kodali Nani VS Chandrababu NAidu : బాబుకు నాని మళ్లీ సవాల్

    Date:

    Kodali Nani Vs ChandraBabu
    Kodali Nani Vs ChandraBabu

    Kodali Nani VS Chandrababu NAidu : మాజీ సీఎం చంద్రబాబుపై ఎప్పడూ విరుచుకుపడే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తన మార్కు తూటాలు పేల్చాడు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నాడు.

    గుడివాడ ఎమ్మెల్యే నాని తన రాజకీయ జీవితాన్ని టీడీపీ నుంచే ప్రారంభించాడు. కానీ ఎప్పుడైతే టీడీపీ నుంచి వైసీపీలో చేరాడో అప్పటి నుంచి  చంద్రబాబును  టార్గెట్ చేసుకున్నాడు. చంద్రబాబు ఏం మాట్లాడినా ఆ వెంటనే కౌంటర్ ఇస్తుంటాడు నాని. చంద్రబాబు ఏ అంశం మీద మాట్లాడినా  అంతకు ముందు నువ్వేం చేశావో చెప్పు అంటూ నిలదీస్తుంటాడు. నీ దిక్కు మాలిన పాలన లో రాష్ర్టం అల్లకల్లోలం అయ్యింది. నీ పాలన అంతా కరువు కాటకాలే. ప్రకృతి కూడా సహకరించదు అంటూ  చంద్రబాబుపై తన దైన శైలిలో ఎదురుదాడికి దిగుతుంటాడు. చంద్రబాబు బర్త్ డేను సైతం విమర్శిస్తూ ఉంటాడు. బాబు 420 అని సంబోధిస్తూ ఉంటాడు. ఏప్రిల్20న పుట్టిన చంద్రబాబు తన అందుకు తగ్గట్లే 420గా మారాడని తన దైన శైలిలో ఎద్దేవా చేస్తుంటాడు.
    గుడివాడ మల్లాయపాలెం లేఅవుట్ లో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో నాని మరోసారి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు. గుడివాడ ప్రజల పాతికేళ్ల కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ దేనని ధన్యవాదాలు తెలిపిన నాని.. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయాడని వమండిపడ్డాడు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన 2004 లో గుడివాడలో అప్పటికే 10 వేల మంది నిరుపేదలున్నట్లు ఉన్నారని అప్పటి సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు
    తాను అడిగిన 45 రోజుల్లో 77 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చేందుకు అంగీకారంచారని చెప్పారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల నిర్మాణం వైఎస్సార్ ఇచ్చిన భిక్షనని అన్నారు.   గుడివాడలో బంధువులు ఉన్నారని, అత్తారిల్లు ఇక్కడే ఉందని, తన సామాజిక వర్గం ఇక్కడే ఉందని చెప్పుకునే చంద్రబాబు.. ఇక్కడి ప్రజలకు ఏం చేయలేదని ఎండగట్టాడు. టీడీపీ హయాంలో జాతీయ స్ధాయిలో చక్రం తిప్పినట్లు చెప్పుకున్నాడే తప్ప చంద్రబాబు  చేసిందేమీ లేదన్నారు. తండ్రి వైఎస్ఆర్ ను మించి జగన్ సీఎంగా ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నాడంటూ కితాబిస్తున్నాడు.  అలాంటి నేతలతో పోల్చుకోవద్దంటూ చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నాడు. దమ్ముంటే, మగాడివైతే చంద్రబాబు గుడివాడ వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kodali Nani Health Updates : కొడాలి నానికి బైపాస్ సర్జరీ.. పరిస్థితి ఎలా ఉందంటే?

    Kodali Nani Health Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి...

    Kodali Nani : ముంబైకి తరలింపు.. కొడాలి నాని పరిస్థితి విషమంగా ఉందా?

    Kodali Nani : వైసీపీ నాయకుడు మరియు మాజీ మంత్రి కొడాలి నానిని...

    Kodali Nani : కొడాలి నానికి గుండె శస్త్రచికిత్స

    Kodali Nani : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి...