ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభ పూజ నుంచి మొదలు ప్రమోషన్ వరకు ఆయన నేమ్ మీదనే అన్నీ జరిగిపోతుంటాయి. నిన్నటికి నిన్న ‘ఆదిపురుష్’ విషయంలో మొదటి షో నుంచి ఫ్లాప్, నెగెటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం షాకూఖ్ ఖాన్ పఠాన్ రికార్డులను దాటింది. ఇదంతా కేవలం ప్రభాస్ పేరులోనే ఉన్న మ్యాజిక్. అలాంటి హీరోతో సినిమా అంటే అంత ఆషామాషీ విషయం కాదు కదా..
ప్రభాస్ తో డైరెక్టర్ మారుతీ ఒక సినిమా తీస్తున్నాడు. దీనికి సంబంధించి టాలీవుట్ లోనే చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు పూజా కార్యక్రమాలు కూడా బయటకు పొక్కలేదు. దీనికి తోడు మారుతీ డైరెక్షన్ లో తాను పని చేస్తున్నట్లు ప్రభాస్ కానీ, ప్రభాస్ తన సినిమా చేస్తున్నట్లు మారుతీ కాని ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటించ లేదు. అయితే షూటింగ్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా చేసుకుంటూ వెళ్తున్నారట.
ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ సినిమాకు వర్కింగ్ టైటిల్ లేకుండా షూటింగ్ ప్రారంభించడం మారుతి గట్స్ అనే చెప్పాలి. నేరుగా టైటిల్ ను లీక్ చేశారు మేకర్స్. అదే ‘రాజా డీలక్స్’. అయితే ఈ సినిమా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభాస్ సినిమాలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో ఒక థియేటర్ ఉంటుంది దాని పేరు ‘రాజా డీలక్స్’. ఈ టైటిల్ పై చాలా మంది నెగెటివ్ కామెంట్లు పెట్టారు. దీంతో మేకర్స్ అది టైటిల్ కాదని సోషల్ మీడియాలో చెప్పారు.
ఇప్పుడు ఇదే సినిమా పేరు ‘అంబాసిడర్’ అని మార్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో కారు కీలకం కానుందట. దీని పేరుమీదనే టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారట మారతి. ఈ పేరుమీద కూడా ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి. తమ హీరో కు ఈ టైటిల్ సూట్ కాదని ఫ్యాన్స్ మళ్లీ వేరేది కోరుకుంటే. ఇలా మార్చుకుంటూ పోవడమేనా.? అయినా వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేయక.. డైరెక్ట్ టైటిల్ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ReplyForward
|