41.5 C
India
Monday, May 6, 2024
More

    Janasana Party Power Star Pawan Kalyan : రాజకీయాల్లోనూ హీరో అవుతాడా.. మరోసారి బలవుతాడా?

    Date:

    Janasena Party Pawan Kalyan
    Janasena Party Pawan Kalyan

     Janasena Party Power Star Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన అధినేత పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నాడు..  జూన్ 14 నుంచి వారాహి యాత్రకు  శ్రీకారం చుడుతున్నాడు. ప్రస్తుతం ఉన్న సినిమా కమిట్ మెంట్స్ అన్నీ పూర్తి చేసుకొని రాబోయే ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండాలని భావిస్తున్నాడు.

    అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసే వారాహి యాత్రపై టీడీపీతో పాటు తెలుగుదేశం అనుబంధ మీడియా కూడా దృష్టి సారిస్తున్నది. పవన్ యాత్రతో తమకేమైనా నష్టం వాటిల్లుతుందా అనే కోణంలో ఆలోచిస్తున్నది. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ అధికార పార్టీకి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా తన గళం విప్పుతున్నాడు. ఇది తమకు లాభిస్తుందని టీడీపీ భావిస్తున్నది. అయితే పవన్ కల్యాణ్ ఒంటరిగా వెళితే ఏమిటనే ప్రశ్న టీడీపీ క్యాంప్ లో ఉత్పన్నమవుతున్నది. ఎందుకంటే పవన్ కల్యాన్ రాజకీయంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేడని గత అనుభవాలు చెబుతున్నాయి. 2014లో ఎక్కడా పోటీ చేయకుండా కేవలం టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చాడు. 2019లో ఒంటరిగా పోటీ చేయడంతో అది టీడీపీని దెబ్బతీసింది. తిరిగి పవన్ కల్యాణ్ ఒంటరిగా వెళితే ఈసారి కూడా తమకు నష్టం తప్పదని టీడీపీ భావిస్తున్నది.కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ వైఖరి చూస్తుంటే ఒంటిరిపోరుకు సుముఖంగా లేడని అర్థమవుతున్నది. ఒంటరిగా పోటీ  చేసి మరో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వనని చెప్పుకొస్తున్నాడు. అధికార పార్టీ వ్యతిరేకతను చీల్చడానికి తాను సిద్ధంగా లేనని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు. అయితే  టీడీపీతో పొత్తు ఉంటుందని, తమకు గౌరవ ప్రదమైన సీట్లు ఇస్తేనే ముందుకు సాగుతామని కూడా చెబుతున్నాడు. అయితే టీడీపీతో ఇది ఏ మేరకు సాధ్యమవుతుందని జనసేన శిబిరంలో చర్చ జరుగుతున్నది. ఏపీలో ఇప్పటి వరకైతే ప్రధాన ప్రతిపక్షం టీడీపీయే. టీడీపీ ఎక్కువ సంఖ్యలో సీట్లు కావాలని పట్టుబడుతున్నది. అదే సమయంలో పవన్ కూడా ఇలాగే బెట్టు చేస్తే పొత్తు కుదిరేది అనుమానమే. ప్రస్తుతం తమకు అధికారం ముఖ్యం కాబట్టి జనసేన కండీషన్లకు చంద్రబాబు తలొగ్గితే టీడీపీకి రాజకీయంగా  దెబ్బ పడే అవకాశం ఉంది.  ఇన్ని చిక్కుల మధ్య పొలిటికల్ గా పవన్ కల్యాన్ హీరో అవుతాడా, బలవుతాడా అనేది వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    NDA Government : ఎన్డీయే ప్రభుత్వంతోనే ‘అనంత’ అభివృద్ధి

    కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు NDA Government :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP-Janasena : టీడీపీ-జనసేన పొత్తుకు జగన్ స్వాగతిస్తున్నారా?

    TDP-Janasena : తెలుగుదేశం పార్టీ - జనసేన పొత్తు విజయవంతమైందని టీడీపీ...

    Janasena : జనసేనలో రాజుకున్న అగ్ని

    Janasena : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్న...

    Bolisetti Satyanarayana : పొత్తుల వల్ల ఎవరికి ఉపయోగం.. జనసేనకు ఇంత తక్కువ సీట్లా?

    Bolisetti Satyanarayana : తెలుగుదేశంతో పాటు జనసేన కలిసి నిన్న (ఫిబ్రవరి...

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...