బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు , నటుడు సతీష్ కౌశిక్ ( 67 ) మరణించారు. ఏ విషయాన్ని ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్ తెలిపారు. సతీష్ కౌశిక్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అలాగే పలు చిత్రాల్లో నటించాడు కూడా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలను పోషించగా ఎక్కువగా హాస్య ప్రధాన పాత్రల్లో నటించాడు సతీష్ కౌశిక్.
తన స్నేహితుడు సతీష్ కౌశిక్ తో తనకు 45 సంవత్సరాల అనుబంధమని , ఇక అతడు లేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసాడు. సతీష్ కౌశిక్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సతీష్ కౌశిక్ హఠాన్మరణం బాలీవుడ్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.