భారత క్రికెట్ లో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకొని చరిత్ర సృష్టించిన క్రికెటర్ సౌరవ్ గంగూలీ. దూకుడు మనస్తత్వం కలిగి ఉన్న సౌరవ్ గంగూలీ సాధారణ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే కెప్టెన్ గా ఎదిగిన తీరుకు ఎవరైనా సరే అచ్చెరువొందటం ఖాయం. ఇక బాలీవుడ్ లో పలు బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా అదే కోవలో గంగూలీ బయోపిక్ కూడా రానుంది. తెరవెనుక గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇక గంగూలీ పాత్రలో నటించే బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ……. రణబీర్ కపూర్ అని తెలుస్తోంది. చాకోలెట్ బాయ్ గా పేరుగాంచిన రణబీర్ కపూర్ గంగూలీ పాత్రలో నటించనున్నాడట. ఆమేరకు చర్చలు కూడా అయ్యాయని తెలుస్తోంది.
క్రికెట్ గురించి మాత్రమే కాకుండా గంగూలీ ప్రేమ విషయాలను కూడా ఇందులో పొందుపరచనున్నారట. అయితే ఇందులో నగ్మాతో గంగూలీ సాగించిన ప్రేమ గురించి ప్రస్తావన ఉంటుందా ? లేదా ? అనే ఆసక్తి నెలకొంది. తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ నగ్మా. అప్పట్లో నగ్మా గంగూలీతో ఘాటు ప్రేమాయణం సాగించింది. అప్పట్లో వీళ్ళ ప్రేమ హాట్ టాపిక్ గా మారింది. పలు మీడియాలలో పతాక శీర్షికలతో వచ్చింది. మరి ఆ ప్రేమ విషయాన్ని తప్పకుండా టచ్ చేస్తారు కాకపోతే ఏ రేంజ్ లో అన్నది చూడాలి.