హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి కూడా పెటాకులు అయ్యింది. అయితే తనకు రెండో పెళ్లి అయినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ రెండో భర్తతో తీవ్ర గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసు పెట్టడంతో వెలుగు చూసింది. 2014 లో దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది అమలాపాల్. అయితే రెండేళ్లకే విజయ్ తో తీవ్ర విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది.
అయితే అలా విడాకులు తీసుకోవడమే ఆలస్యం ఇలా భవిందర్ సింగ్ ను చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుంది అమలాపాల్. ఈ పెళ్లి విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ తనకు తెలిసి చేసిందో లేక తెలియక చేసిందో కానీ భవిందర్ సింగ్ తో కలిసి లిప్ లాక్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసింది.
ఇద్దరు కూడా పెళ్లి దుస్తుల్లో ఉండటంతో మళ్లీ పెళ్లి చేసుకుందని అనుకున్నారు….. శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే అబ్బే పెళ్లి కాదు కేవలం ఓ యాడ్ కోసం ఫోటో షూట్ మాత్రమే అని బదులిచ్చింది. కట్ చేస్తే మేము 2017 లో పెళ్లి చేసుకున్నామని భవిందర్ సింగ్ కోర్టుకు ఆధారాలతో సహా చూపించడంతో అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇప్పుడు అమలాపాల్ రెండో పెళ్లి విషయం రచ్చ రచ్చగా మారింది.