
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ త్రిష. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన త్రిష గతకొంత కాలంగా రేసులో లేకుండాపోయింది. ఇక హీరోయిన్ గా అవకాశాలు రావడం కష్టమే అని భావించిన త్రిష తన మనసుని రాజకీయాల మీదకు మళ్లించినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అయితే మంచిదా ? కాంగ్రెస్ పార్టీ అయితే మంచిదా ? అని ఆలోచిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు త్రిషని సంప్రదించారట.
దాంతో కాంగ్రెస్ పార్టీలో త్రిష చేరడం ఖాయమని తెలుస్తోంది. ఆమేరకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు త్రిష ని కలిసి పలు అంశాల మీద చర్చించారట. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడమే మంచిదనే నిర్ణయానికి వచ్చిందట. ఇక ఇదే సమయంలో బీజేపీ అయితేనే బెస్ట్ అని ఉచిత సలహా ఇస్తున్నారట త్రిష సన్నిహితులు. జయలలిత లాగా తమిళనాట రాజకీయంగా ఓ వెలుగు వెలగాలని ఆశిస్తోందట ఈ భామ మరి ఆ ఆశలు నెరవేరుతాయా ? చూడాలి.