నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం హిందీలో కూడా డబ్ అవుతోంది. తాజాగా అఖండ హిందీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ హిందీలో డబ్ చేస్తోంది. సినిమాను జనవరి 20 న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.
ఇక హిందీ ట్రైలర్ విషయానికి వస్తే……. తెలుగులో వచ్చిన ట్రైలర్ నే హిందీలో కూడా యాజిటీజ్ గా దించేశారు. అయితే బాలయ్య డైలాగ్స్ ఎలా ఉంటాయి ? బాలయ్య కు డబ్బింగ్ చెప్పిందేవరు ? వాయిస్ సెట్ అయ్యిందా ? అని చూసేవాళ్లకు కొంచెం షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య వాయిస్ విన్న తెలుగు ప్రేక్షకులకు హిందీ వాయిస్ కొద్దిగా నచ్చదు. కాకపోతే హిందీ ప్రేక్షకులకు తెలిసిన వాయిస్ కాబట్టి సమస్య ఉండబోదు. అఖండ తెలుగులో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరి హిందీలో ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలంటే జనవరి 20 వరకు ఎదురు చూడాల్సిందే.