ఉంగరాల జుట్టు ఉన్న డీజే టిల్లు మరో ఉంగరాల జుట్టు ఉన్న భామతో సీక్వెల్ లో రొమాన్స్ చేయనున్నాడు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా డీజే టిల్లు 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మొదటి పార్ట్ హీరోయిన్ ని కాకుండా మరో హీరోయిన్ ని తీసుకోవాలని ప్లాన్ చేశారు. తాజాగా ఆ భామను ఎంపిక చేశారట. ఇంతకీ ఆ ఉంగరాల జుట్టు భామ ఎవరో తెలుసా…… ఇంకెవరు …… అనుపమ పరమేశ్వరన్ .
ఇటీవలే కార్తికేయ 2 చిత్రంతో సాలీడ్ గా బ్లాక్ బస్టర్ కొట్టేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ ముద్దుగుమ్మ రొమాంటిక్ సీన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో డీజే టిల్లు లో పెట్టుకున్నారట. మొదట్లో ఈ భామ రొమాంటిక్ పాత్రలను చేయలేదు. ఒకవేళ కొన్ని చిత్రాల్లో చేసినా లిప్ లాక్ లకు ఘాటు కౌగిలింతలకు ఒప్పుకోలేదు. కానీ దిల్ రాజు చిత్రం కోసం మొదటిసారి ఆ గీత దాటేసింది. దాంతో ఇలా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. డీజే టిల్లు 2 లో ఇంటిమేట్ సీన్స్ చాలా ఉన్నాయట. అంటే కుర్రాళ్లకు పండగే అన్నమాట.