
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ లకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంతకీ చిరు , బాలయ్య లకు ఇచ్చిన స్పెషల్ పర్మిషన్ ఏంటో తెలుసా……… టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది జగన్ ప్రభుత్వం. భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించాలని మైత్రి మూవీ మేకర్స్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.
వాల్తేరు వీరయ్య కు 45 రూపాయలు , బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రానికి 40 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకుంటామని అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు నిర్మాతలు. అయితే అధికారులు అందుకు సమ్మతం తెలిపినప్పటికి జగన్ మాత్రం చిరంజీవి వాల్తేరు వీరయ్య కు 25 రూపాయలు , బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రానికి 20 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చాడు. రేపు అంటే జనవరి 12 న బాలయ్య వీర సింహా రెడ్డి విడుదల అవుతుండగా జనవరి13 న చిరు వాల్తేరు వీరయ్య విడుదల అవుతున్న విషయం తెలిసిందే.