
ఈరోజు అన్న నందమూరి తారకరామారావు 27 వ వర్ధంతి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించారు నందమూరి కుటుంబ ఫ్యామిలీ. నందమూరి బాలకృష్ణ , రామకృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని తదితరులు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులు అర్పించారు. ఇక అంతకంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ , నందమూరి కళ్యాణ్ రామ్ లు వెళ్లి తాతకు నివాళులు అర్పించారు. నందమూరి లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. నందమూరి కుటుంబ సభ్యులు విడివిడిగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకోవడం , నివాళులు అర్పించడం చాలా కాలంగా సాగుతున్న తతంగం. కాగా ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యింది.