
” సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో ……. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు ….. మార్చలేరు ” ,
” పదవి చూసుకొని నీకు పొగరేమో – బై బర్త్ నా DNA కె పొగరెక్కువా ” అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేసాడు హీరో నందమూరి బాలకృష్ణ. తాజాగా బాలయ్య నటించిన చిత్రం వీరసింహా రెడ్డి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఒంగోలులో జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో వీరసింహా రెడ్డి ట్రైలర్ ను విడుదల చేసారు.
వీరసింహా రెడ్డి ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇక బాలయ్య డైనమైట్ లాంటి డైలాగ్స్ తో దద్దరిల్లి పోయేలా చేసాడు. ఇక పనిలో పనిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేసాడు. పై డైలాగ్స్ జగన్ ను ఉద్దేశించి చేసినవే ! ఇటీవల ఏపీ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించి డాక్టర్ వైఎస్సార్ అనే పేరు మార్చిన విషయం తెలిసిందే. దాంతో దానికి కౌంటర్ మొదటి డైలాగ్.
ఇక రెండో డైలాగ్ ఏంటంటే …… ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతూ ….. సినిమా టికెట్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లొకేషన్ మారింది. వాటికి తగ్గట్లుగా ఈ రెండో డైలాగ్ ఉంది. ఇక సినిమాలో మరిన్ని డైలాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వీరసింహా రెడ్డి చిత్రం రాజకీయ దుమారం రేపేలా కనబడుతోంది. జనవరి 12 న వీరసింహా రెడ్డి భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక ట్రైలర్ అదిరిపోవడంతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే అని ధీమాగా ఉన్నారు బాలయ్య అభిమానులు.