నటుడు , నిర్మాత బండ్ల గణేష్ చేసిన సంచలన ట్వీట్ వైరల్ గా మారింది. బండ్ల గణేష్ ట్వీట్ ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేస్తోంది. దాంతో బండ్ల గణేష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇంతకీ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఏంటో తెలుసా…….. I love you KCR sir ….. అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేయడమే.
ఐ లవ్ యు కేసీఆర్ సార్ అని ట్వీట్ చేస్తే ఎన్టీఆర్ అభిమానులకు కోపం ఎందుకు అని అనుకుంటున్నారా ? అసలు విషయం ఏమిటంటే……. హిందీ చిత్రం బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న అంటే సెప్టెంబర్ 2 న భారీ ఎత్తున హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేయడానికి సన్నాహాలు చేశారు.
ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటుండటంతో కేసీఆర్ ప్రభుత్వానికి నచ్చలేదట. దాంతో గణపతి ఉత్సవాలలో పోలీసులు పాల్గొంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని ఇచ్చిన అనుమతిని క్యాన్సిల్ చేశారు. దాంతో చివరి నిమిషంలో ఏమి చేయాలో తెలీక పార్క్ హయత్ హోటల్ లో మాములు ఫంక్షన్ లా చేశారు. ఎన్టీఆర్ హాజరు కానున్న షోకు కేసీఆర్ అనుమతి నిరాకరించడంతో బండ్ల గణేష్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. బండ్ల గణేష్ మెగా కుటుంబం కు వీరాభిమాని అందునా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మరింత పిచ్చి.
ఇక ఎన్టీఆర్ తో టెంపర్ , బాద్ షా అనే రెండు చిత్రాలను నిర్మించాడు బండ్ల గణేష్. రెండు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే టెంపర్ చిత్ర సమయంలో ఎన్టీఆర్ కు బండ్ల గణేష్ కు స్వల్ప విబేధాలు వచ్చాయట. దాంతో అప్పటి నుండి ఎన్టీఆర్ కు దూరమయ్యాడు బండ్ల. ఆ కోపం ఉంది కదా …… ఇప్పుడు ఆ కోపాన్ని ఇలా తీర్చుకున్నాడన్న మాట.