39.9 C
India
Tuesday, April 21, 2026
More

    బాలయ్య కి ఊహించని షాక్ ఇచ్చిన బోయపాటి

    Date:

    Boyapati gave an unexpected shock to Balayya
    Boyapati gave an unexpected shock to Balayya

    బాలయ్య, బోయపాటి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బాలయ్య, బోయపాటిది డెడ్లీ కాంబినేషన్. సింహా, లెజెండ్, అఖండ సినిమాలు.. ఒక దాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాయి. నెక్స్ట్ అఖండ సీక్వెల్ కూడా రాబోతోంది. కానీ ఇప్పడు ఇద్దరి మధ్య పోటీ తప్పేలా లేదంటున్నారు. అయితే మాములుగానే హీరోల‌ను మాస్‌గా ఎలివేట్ చేయ‌టంలో బోయ‌పాటి శ్రీనుకి సాటిలేరు. అలాంటి ఆయన రామ్ తో సినిమా చేయడం హాట్ టాపిక్ గామారింది.

    ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్‌తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు రామ్. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో.. ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇక బోయ‌పాటి ఎప్ప‌టిలాగానే ఈ సినిమాలోనూ రామ్‌ను వైల్డ్ లుక్‌తో చూపించబోతున్నాడు. ఆ విష‌యం రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌ చూస్తే అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈసారి దసరాకు బాలయ్య కూడా రాబోతున్నాడనే టాక్ నడుస్తోంది.

    ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్బీకె 108 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ అంచనాలను భారీగా పెంచేశాయి. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్, బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు బోయపాటి, రామ్ సినిమా.. దసరాకు వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు దసరా బరిలో మరో సినిమా లేదు. కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బరిలో దిగడం పక్కా అంటున్నారు. అదే జరిగితే బాలయ్యతో బోయపాటికి పోటీ తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...