
బాలయ్య అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది చందనా బ్రదర్స్. అదేంటో తెలుసా ……… గ్రీన్ సూట్ , రెడ్ సూట్ , వైట్ సూట్ లో ఉన్న బాలయ్య ఫోటోలను పోస్ట్ చేసి ఇవి ఏ ఏ సందర్భాల్లో వేసుకున్నవో చెబితే అలాంటి అభిమానులకు నేరుగా బాలయ్య ను కలిసే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. బాలయ్య తాజాగా ఆహా కోసం అన్ స్టాపబుల్ 2 షో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ షోలో పాల్గొనే అవకాశం అభిమానులకు కల్పించనుంది.
ఇంకేముంది బాలయ్య ఫోటోలను చూసిన అభిమానులు అవి ఏ సందర్భంగా వేసుకున్నవో చెబుతున్నారు. ఇలా సరిగ్గా చెప్పినవాళ్లలో కొంతమందిని అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షోలో అనుమతి ఇవ్వనున్నారు. తమ అభిమాన కథానాయకుడిని దగ్గరగా చూడాలని , స్వయంగా చూడాలని కోరుకునే వాళ్ళు కోకొల్లలు. దాంతో ఈ పోటీకి భారీగా డిమాండ్ ఏర్పడింది.
ప్రస్తుతం బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రాన్ని పూర్తి చేసాడు. ఈ సినిమా జనవరి 12 న విడుదల కానుంది. ఇక రేపు అనగా డిసెంబర్ 8 న బాలయ్య కొత్త సినిమా ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.