Ileana గోవా బ్యూటీ ఇలియానా అంటే ఎంత క్రేజ్ ఉందో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ భామ తన నడుముతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.. అమ్మడి నడుముకు ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.. అప్పట్లో ఎవరి నోటా విన్న ఇలియానా పేరునే వినిపించేది. అంతలా తన అందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది.
అప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీ చూడని అందాలను పరిచయం చేయడంతో ఈమె 10 ఏళ్ల పాటు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ డస్కీ బ్యూటీ అగ్ర హీరోయిన్ గా మారి స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.. అయితే ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లడంతో ఈమెకు అక్కడ పెద్దగా స్టార్ డమ్ రాలేదు.. కానీ ఈమె వ్యక్తిగతంగా మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఈ హాట్ బ్యూటీ ప్రెగ్నెన్సీ అని ప్రకటించింది.. ముందు తండ్రి ఎవరో చెప్పకుండా పెళ్ళికి ముందే తల్లి కాబోతున్న అని ప్రకటించడంతో ఈమె వార్తల్లో నిలిచింది. అయితే ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోతో ఎఫైర్ నడిపాను అని చెప్పి అందరికి షాకింగ్ న్యూస్ చెప్పింది.
యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు హార్మోన్స్ సమస్య తలెత్తింది.. దాంతో ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు వాటిని కంట్రోల్ చేసుకోలేక ఒక తెలుగు హీరోతో ఎఫైర్ పెట్టుకున్నాను.. 6 ఏళ్ల పాటు అతడితో డేటింగ్ చేశా.. చివరికి బేధాభిప్రాయాలు రావడంతో ఇద్దరం విడిపోయాం.. అప్పటి నుండి మేము కలుసుకోలేదు.. అంటూ ఈమె చెప్పడంతో ఆ హీరో ఎవరా అని మన వాళ్ళు తెగ సర్చింగ్ చేసేస్తున్నారు.