ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నానని ఇక ఆ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తానని స్పష్టం చేశాడు హీరో నందమూరి బాలకృష్ణ. 1991 లో విడుదలైన ఆదిత్య 369 చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే కాదు ఇటీవల కాలంలో కూడా ఆదిత్య 369 పేరు మారుమోగుతూనే ఉంది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాడు బాలయ్య దాంతో స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు.
ఆదిత్య 369 చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. కానీ ఇప్పుడు ఆయన వయసు మీద పడటంతో బాలయ్య సింగీతం కు ఆ బాధ్యతలు అప్పగించకుండా తానే దర్శకత్వం వహించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇక ఈ సినిమాను 2023 లో అంటే వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే ….. ఈ చిత్రంలో బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ కూడా నటించనున్నాడు మరి.