36.9 C
India
Tuesday, April 21, 2026
More

    విమర్శలను సోపానాలుగా చేసుకున్న అల్లు అర్జున్

    Date:

    Happy Birthday Allu Arjun 
    Happy Birthday Allu Arjun

    అల్లు అర్జున్ ….. యూత్ ఐకాన్ గా మారాడు ….. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే గంగోత్రి సినిమా సమయంలో మాత్రం దారుణమైన విమర్శలను ఎదుర్కొన్నాడు. గంగోత్రి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసాడు అల్లు అర్జున్. అయితే ఆ సినిమాలో అల్లు అర్జున్ ని చూసిన మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ లుక్ పై దారుణమైన విమర్శలు చేసారు.

    యితడు హీరో ఏంట్రా బాబూ ! మరేం ……. మామయ్య మెగాస్టార్ , తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ కాబట్టి హీరో అయ్యాడులే …… లేకపోతే ఇతను హీరో ఏంటి ? ఆ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడా ? లేదా ? అంటూ దారుణాతి దారుణమైన కెమెంట్స్ చేసారు. ఇంకా అప్పట్లో సోషల్ మీడియా లేదు ….. లేకపోతే ఇంకా దారుణమైన మీమ్స్ , భాష వాడేవాళ్లు.

    అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా అల్లు అర్జున్ మాత్రం ఆ విమర్శలను సోపానాలుగా మలుచుకున్నాడు. ఎంతగా విమర్శలు చేశారో అలాంటి వాళ్ళ చేతనే శభాష్ …… హీరో అంటే నువ్వేరా ? అనిపించేలా చేసాడు. సిక్స్ ప్యాక్ తో టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అల్లు అర్జున్ కు ముందు టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ చేసిన హీరోలు లేరు.

    అంతేనా అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని దారుణంగా విమర్శించిన వాళ్ళ చేతనే పొగడ్తల వర్షం కురిపించేలా చేసాడు. తనని తాను మలుచుకున్న తీరుకు ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అల్లు అర్జున్ అంటే ఒక బ్రాండ్ అనిపించేలా మామయ్య , తండ్రి బ్రాండ్ ల నుండి బయటకు వచ్చి సొంతంగా ఎదిగాడు.

    అల్లు అర్జున్ కు ఒక్క తెలుగులోనే కాదు మలయాళంలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. స్టైల్ కు ఐకాన్ గా తయారయ్యాడు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని JSW & Jaiswaraajya.tv జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ

    Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...