
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. అనూహ్యంగా పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయిన ఈ భామ అలా ఓ బిడ్డను కనడమే ఆలస్యం ఇలా నాలుగు నెలలు కాగానే మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమైపోయింది. కుర్రాళ్లను నిద్రపోకుండా చేసే సత్తా తనలో ఉందని చాటిచెప్పడమే తన లక్ష్యమేమో ……. అందుకే ఇలా కవ్విస్తూ ఫోటో షూట్ చేసింది.
పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కాగానే హీరోయిన్ లు మారిపోతుంటారు. తమ శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది దాంతో హీరోయిన్ గా నటించడం కాస్త కష్టమే ! కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఇంతకుముందు కంటే మరింత అందంగా ఉంది ఈ ఫోటోలు చూస్తుంటే. తాజాగా చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. రకరకాల భంగిమల్లో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి నేను రెడీ అన్నట్లుగా ఫోజు ఇచ్చింది.
కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 చిత్రంలో నటించాల్సి ఉండే. అయితే ఆ సినిమా ఆగిపోవడం అలాగే కాజల్ కు పెళ్లి కావడంతో ఇక ఈ సినిమా నుండి కాజల్ ను తొలగించినట్లే అని అనుకున్నారు. కట్ చేస్తే ……. కాజల్ అగర్వాల్ ను మళ్ళీ ఈ సినిమాలో తీసుకున్నారు. ఇటీవలే ఇండియన్ 2 స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. దాంతో కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది ఇండియన్ 2 చిత్రంతో.