నటసింహం నందమూరి బాలకృష్ణ చేస్తున్న షో ” అన్ స్టాపబుల్ ”. ఆహా కోసం చేస్తున్న ఈ షో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దేశ వ్యాప్తంగా ఈ షో నెంబర్ వన్ గా నిలిచి సంచలనం సృష్టించింది. కట్ చేస్తే ఇప్పుడు మరింత జోష్ తో అన్ స్టాపబుల్ – 2 సీజన్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ 2 షో షూటింగ్ జరిగింది.
అక్టోబర్ 4 న అన్ స్టాపబుల్ 2 ట్రైలర్ ని విడుదల చేయనున్నారు ఆహా టీమ్. అంతేకాదు ఈ రెండో సీజన్ ఎప్పుడు ప్రారంభం కానుందో అది కూడా స్పష్టం చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5 న విడుదల అవుతుండటంతో ఈ రెండో సీజన్ లో మొదటి షోకు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే టర్కీ నుండి వచ్చిన బాలయ్య ఆహా కోసం రెడీ అయిపోయాడు. అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ఎలా ఉండబోతోందో హింట్ ఇవ్వనున్నారు అక్టోబర్ 4 న. ఈ రెండో సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్యకు తోడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోలో పాల్గొంటుండటంతో ఈ సీజన్ కు సూపర్ కిక్ ఇచ్చే ఎపిసోడ్ అన్నమాట. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ ఇద్దరినీ చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి.