నందమూరి తారకరత్న అకాల మరణంతో ఈనెల 24 న ప్రారంభం కావాల్సిన ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా వాయిదా పడింది. మళ్లీ ఈ సినిమా ప్రారంభం ఎప్పుడు అనేది వెల్లడిస్తామని ఓ ప్రకటన విడుదల చేశారు నిర్మాతలు. గతకొంత కాలంగా ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా అప్ డేట్స్ గురించి అభిమానులు పదేపదే అడుగుతున్నారు. దాంతో వాళ్ళ అభ్యర్ధన మేరకు ఈనెల 24 న అంగరంగ వైభవంగా సినిమా ప్రారంభించాలని అనుకున్నారు. ముహూర్తం నిర్ణయించారు. అయితే అనూహ్యంగా నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.
Breaking News