నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ” అన్ స్టాపబుల్ 2”. ఈ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొననున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను ఈ షోకు తీసుకురావాలని అనుకున్నారు ఆహా టీమ్. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు త్రివిక్రమ్ ద్వారా పవన్ కళ్యాణ్ ను తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి దాంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక ఈ షో ఈనెల 27 న షూట్ చేయనున్నారట. పవన్ కళ్యాణ్ తో పాటుగా దర్శకుడు క్రిష్ కూడా ఈ షోలో పాల్గొననున్నాడు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కూడా పాల్గొననున్నాడు. దర్శకులు క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
డిసెంబర్ 27 న ఆహా టీమ్ తో కలవనున్నాడు పవన్ కళ్యాణ్. బాలయ్య అన్ స్టాపబుల్ షో ను అద్భుతంగా హోస్ట్ చేస్తుండటంతో ఈ షో రికార్డుల మోత మోగిస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ షోకు రావడానికి అంగీకరించాడు. పవన్ కళ్యాణ్ వస్తుండటంతో కాస్త గ్రాండ్ గా వెల్ కం చెప్పాలనే ఆలోచనలో ఉన్నారట ఆహా టీమ్. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద బాలయ్య – పవన్ కళ్యాణ్ లు కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా ! మొత్తానికి ఈ షో కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఇక ఈ షోలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తప్పకుండా ప్రశ్న రావడం ఖాయంగా కనిపిస్తోంది.