
నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న షో ” అన్ స్టాపబుల్ విత్ nbk ”. ఆహా ఓటీటీ కోసం నిర్వహిస్తున్న ఈ షో దేశంలోనే నెంబర్ వన్ షోగా అవతరించిన సంగతి తెలిసిందే. బాలయ్య తనదైన శైలిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు గెస్ట్ లుగా వస్తున్నారు. ఇక ఈ షోలో పాల్గొనాలని పలువురు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. తాజాగా డార్లింగ్ ప్రభాస్ తో పాటుగా హీరో గోపీచంద్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇక ఆ షోలో ఒక హీరోయిన్ కోసం మేమిద్దరం గొడవ పడ్డామని చెప్పాడు హీరో గోపీచంద్. దాంతో షాక్ అవుతాడు డార్లింగ్ ప్రభాస్ . ఇంకేముంది దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ గోపీచంద్ కల్పించుకొని ” వర్షం ” చిత్రంలో త్రిష కోసం ఇద్దరం పోటీ పడ్డాం కదా సార్ అని కవరింగ్ ఇస్తాడు. దానికి ప్రభాస్ బాగా బాగా చెప్పావ్ అంటూ మరింత కవరింగ్ ఇస్తాడు.
అయితే అప్పట్లో అనుష్క కోసం ఈ ఇద్దరూ పోటీ పడినట్లు ఫిలిం నగర్ సర్కిల్లో గుసగుసలు వినిపించాయి. కెరీర్ ప్రారంభంలో వరుసగా రెండు చిత్రాల్లో గోపీచంద్ సరసన నటించింది అనుష్క. శౌర్యం , లక్ష్యం చిత్రాల్లో అనుష్క – గోపీచంద్ జంటగా నటించారు. కట్ చేస్తే ప్రభాస్ తో ఏకంగా నాలుగు చిత్రాల్లో నటించింది అనుష్క. ఇక ప్రేక్షకులు కూడా మెచ్చిన జంట అంటే …… ప్రభాస్ – అనుష్క లదే .
గతకొంత కాలంగా ప్రభాస్ – అనుష్క ల పెళ్లి గురించే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ చాలా క్లోజ్ …… కానీ మేము మాత్రం మంచి ఫ్రెండ్స్ మాత్రమే ! ప్రేమికులం కాదని అంటున్నారు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఆవార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బాలయ్య షోలో పాల్గొన్న ప్రభాస్ పలు అంశాలను వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా రాగా తాజాగా రెండో భాగం కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.