
డార్లింగ్ ప్రభాస్ అంటే చాలు ముందుగా బ్రహ్మాండమైన విందు ఇస్తాడనే పేరుంది. తన హీరోయిన్ లకు రకరకాల వంటకాలను ఇంట్లో చేయించి మరీ వాళ్ళను తినమని పోరు పెడుతుంటాడు అనే పేరుంది. ప్రభాస్ ఇంట్లో చేయించి లొకేషన్ కు తెప్పించే వంటకాల లిస్ట్ పెద్దగానే ఉంటుంది. అన్ని రకాల వంటకాలను తినలేమని దండం పెట్టేవాళ్ళు పలువురు హీరోయిన్లు.
తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణకు కూడా బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు. ఒక్క బాలయ్య కు మాత్రమే కాదు అన్ స్టాపబుల్ షో స్టాఫ్ కు కూడా ఇంట్లో వంటకాలు చేయించి తెప్పించాడట. దాంతో బాలయ్యతో పాటుగా ఆహా స్టాఫ్ మొత్తం ఆ వంటకాలను తినేసి డార్లింగ్ ప్రభాస్ కు థాంక్స్ చెప్పారట.
ఇక బాలయ్యకు ఏ రకమైన వంటకాలు ఇష్టమో అవి తెలుసుకొని ఆ వంటకాలు చేయించాడు ప్రభాస్. ఇంతకీ ప్రభాస్ చేయించిన వంటకాలు ఏంటో తెలుసా ……. చేపల పులుసు , మటన్ కర్రీ , చికెన్ , పీతల ఇగురు , పప్పు , ఆవకాయ్ , సాంబార్. ఇక మటన్ , చికెన్ వంటకాలను విభిన్నంగా చేయించాడట. ఇవన్నీ కూడా బాలయ్యకు బాగా ఇష్టం. బాలయ్య కూడా భోజన ప్రియుడు అనే విషయం తెలిసిందే. ఇక చేపల పులుసు అంటే మరీ మరీ ఇష్టం బాలయ్యకు. దాంతో ఆ చేపల పులుసును లొట్టలేసుకుంటూ మరీ తిన్నాడట.
ప్రభాస్ తో పాటుగా ఈ ఇంటర్వ్యూలో హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. ప్రభాస్ – గోపీచంద్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఈ ఇద్దరూ కలిసి వర్షం చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. వర్షం చిత్రంలో హీరో ప్రభాస్ కాగా విలన్ గోపీచంద్. దాంతో ఆ సినిమా నుండి ప్రాణ స్నేహితులు అయ్యారు. అందుకే ఈ షోకు కూడా ప్రభాస్ – గోపీచంద్ హాజరయ్యారు. ఈ షో త్వరలోనే ఆహా లో ప్రసారం కానుంది.