నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా ఆహా కోసం చేస్తున్న షో ” UNSTOPPABLE with NBK 2 ” . మొదటి సీజన్ భారీ విజయం సాధించడంతో సెకండ్ సీజన్ కూడా మొదలు పెట్టారు. ఇక సెకండ్ సీజన్ కూడా అదరహో అనిపిస్తోంది. తాజాగా ఈ షోలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డార్లింగ్ ప్రభాస్. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో మొదటి సీజన్ లోనే ప్రభాస్ పాల్గొనాల్సి ఉండే కానీ బాలయ్య డేట్స్ ఖాళీగా ఉన్న సమయంలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఖాళీగా ఉన్న సమయంలో బాలయ్య బిజీగా ఉన్నాడు దాంతో కుదరలేదు.
కట్ చేస్తే రెండో సీజన్ కు ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. డిసెంబర్ 11 న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ 2 షో లో పాల్గొననున్నాడు ప్రభాస్. అయితే ఈ షోలో ప్రభాస్ ఒక్కడే కాకుండా మరో హీరో కూడా పాల్గొంటున్నాడు అతడే గోపీచంద్. ప్రభాస్ – గోపీచంద్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. వర్షం చిత్రంలో నటించిన సమయంలో ఏర్పడిన ఫ్రెండ్ షిప్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వర్షం చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించగా గోపీచంద్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.
బాలయ్య హోస్ట్ గా చేయడం ఏంటి ? ఈ షోను ఎవరు చూస్తారు ? అనే ప్రశ్నలు ఉండేవి మొదట్లో కానీ మొదటి సీజన్ లో మొదటి ఎపిసోడ్ తోనే అదరగొట్టాడు బాలయ్య. దాంతో టాక్ షోలకు అమ్మా మొగుడు అయ్యింది బాలయ్య అన్ స్టాపబుల్ షో. బాలయ్య చేసే చిలిపి పనులకు కొంటె ప్రశ్నలకు సెలబ్రిటీలతో పాటుగా ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక బాలయ్య షోలో పాన్ ఇండియా స్టార్ అయిన డార్లింగ్ ప్రభాస్ పాల్గొంటే ఈ షో మరో లెవల్ లో రికార్డులు సృష్టించడం ఖాయం. డిసెంబర్ 11 న ప్రభాస్ , గోపీచంద్ లు బాలయ్య షోలో పాల్గొననున్నారు. అంటే డిసెంబర్ మూడో వారంలో లేదా నాలుగో వారంలో ఈ షో ఆహా లో స్ట్రీమింగ్ కి రావడం ఖాయం.