
డార్లింగ్ ప్రభాస్ కు పెళ్లి యోగం లేదా ? అంటే ……. లేదు అనే అంటున్నాడు ప్రభాస్. నాకు పెళ్లి యోగం లేనట్లుంది సార్ …… అంటూ బాలయ్య కు చెప్పాడు డార్లింగ్ దాంతో ఏమయ్యా ! మీ అమ్మకు చెప్పినట్లు నాకు చెప్పొద్దు అంటూ ఆడుకున్నాడు బాలయ్య. ఈ సంఘటన ఆహా కోసం బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ 2 లో చోటు చేసుకుంది.
బాహుబలి డార్లింగ్ ప్రభాస్ ను బాలయ్య తన అన్ స్టాపబుల్ విత్ NBK షోలో ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ షో తాలూకు మొదటి ఎపిసోడ్ రేపు అంటే డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ కి రానుంది. అలాగే రెండో ఎపిసోడ్ కూడా తర్వాత ప్రసారం కానుంది. ఆ షోలో బాలయ్య డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించగా నా నుదుటిపై పెళ్లి యోగం రాసి ఉందో ? లేదో ? అన్నట్లుగా సమాధానం చెప్పాడు. కట్ చేస్తే బాలయ్య కూడా గట్టిగానే ఇచ్చాడు.
ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాహుబలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ , హీరో గోపీచంద్ లతో చేసిన ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా రానుంది. ఈ ఎపిసోడ్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య రేంజ్ కు తోడు ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కూడా తోడవడం వల్ల రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.