మాస్ మహరాజ్ రవితేజ బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తోంది. ధమాకా చిత్రం 3 రోజుల్లోనే 32 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేస్తోంది. డిసెంబర్ 23 న విడుదలైన ధమాకా మొదటి రోజున 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రెండో రోజున 9 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక మూడో రోజు ఆదివారం బాగా కలిసి వచ్చింది. 13 కోట్ల వసూళ్లు ఆదివారం రావడంతో మొత్తంగా మూడు రోజుల్లో 32 కోట్లు వసూల్ చేసింది. దాంతో రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. భీమ్స్ అందించిన పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. అలాగే భీమ్స్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. శ్రీ లీల అందాలు ఈ సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. శ్రీ లీల గ్లామర్ కు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఇక రవితేజ విషయానికి వస్తే……. చాలాకాలంగా సరైన హిట్స్ లేక కెరీర్ డోలాయమానంగా తయారైన సమయంలో ధమాకా సూపర్ హిట్ కావడంతో చాలా చాలా సంతోషంగా ఉన్నాడు.