మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ధమాకా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది దాంతో 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధ్యమయ్యాయి. ఎట్టకేలకు రవితేజ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ ల తర్వాత 100 కోట్ల క్లబ్ లో చేరింది రవితేజ మాత్రమే ! అయితే విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్ 3 వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కానీ వెంకీ కి అది సోలో సినిమా కాదు కాబట్టి ఆ అరుదైన ఫీట్ ను అందుకున్న సీనియర్ హీరోలలో రవితేజ మూడో హీరో అయ్యాడు.
డిసెంబర్ 23 న విడుదలైన ధమాకా చిత్రానికి మొదటి రోజు నుండే హిట్ టాక్ వచ్చింది. యునానిమస్ గా హిట్ టాక్ రావడంతో వసూళ్ళ వర్షం కురిసింది. పక్కా మాస్ మసాలా చిత్రంగా వచ్చిన ధమాకా చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది అనే చెప్పాలి. 2022 ఇయర్ ఎండింగ్ లో భారీ హిట్ కొట్టి ఆ సంవత్సరానికి మంచి సెండాఫ్ ఇచ్చింది రవితేజ ధమాకా.
రవితేజ యాక్షన్ కు శ్రీ లీల గ్లామర్ తోడవ్వడంతో ఇంత పెద్ద హిట్ అయ్యింది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈ చిత్రంలో కామెడీకి కూడా పెద్ద పీట వేశారు. ఇంకేముంది అటు యాక్షన్ , ఇటు గ్లామర్ మధ్యలో కామెడీ మొత్తంగా అన్ని రుచులు కలగలిపిన సినిమా కావడంతో ధమాకా భారీ హిట్ కొట్టింది. మరో అయిదు రోజుల వరకు సరైన సినిమా లేదు కాబట్టి ధమాకా మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయమని భావిస్తున్నారు.